బుల్లితెర మీద ఫేమస్ అయ్యేది సెలబ్రిటీస్ మాత్రమే కాదు వాళ్ళ ఫామిలీ మెంబర్స్ కూడా సెలబ్రిటీస్ ఐపొతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో యాంకర్ రవి గురించి మనందరికీ తెలుసు.. చాలా ఏళ్ళ నుంచి బుల్లితెర మీద యాంకర్ గా ఎంత ఫేమస్సో అయ్యాడో మనం చూసాం. అలాంటి రవి కూతురు వియ కూడా అంతే ఫేమస్ ఐపోయింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని క్రియేట్ చేసుకుంది. అందులో కొంతమంది ఫాన్స్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చింది. "రాహుల్ సిప్లిగంజ్ గురించి ఒక మాటలో ఏం చెప్తావ్" అని అడిగేసరికి "రాహుల్ మామ .. హి ఈజ్ ది స్వీటెస్ట్..నేను రాహుల్ మామతో కలిసి "హైడ్ అండ్ సీక్" లో కనిపించాను. ఇంకా మామకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది రాహుల్ మామ..ఐ లవ్ యు అంటూ ఒక ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చింది" చిన్నారి వియ.
అలా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు..దానికి వరసగా ఆన్సర్స్ ఇచ్చేసింది.."నాకు డాన్స్ చేయడం హాబీ...మా అమ్మ ఏ ఫుడ్ చేసినా నచ్చుతుంది...కానీ నాకు నూడుల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు థర్డ్ క్లాస్ కి వచ్చాను. నేను ప్రెజెంట్ స్కెటింగ్ నేర్చుకుంటున్నా. నాకు నాన్- వెజ్ అంటే ఇష్టం. గుడ్ థింగ్స్, బాడ్ థింగ్స్, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు అమ్మ నాన్న దగ్గర నుంచి నేర్చుకుంటాను... ఇంగ్లీష్ ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడానికి కారణం మా అమ్మ నాతో ఎన్నో రకాల బుక్స్ చదివిస్తుంది. నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏమిటి అంటే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన నాన్నను మూడు నెలల తర్వాత చూడడం మర్చిపోలేని విషయం..నా ఫేవరేట్ యాంకర్ మా నాన్న" అంటూ సింగర్ శ్రీరామచంద్రతో, హమీదాతో దిగిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది వియ. లాక్ డౌన్ టైంలో యాంకర్ రవి, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా వీళ్లందరితో కలిసి ఒక ఐదు నిమిషాల నిడివి ఉన్న "హైడ్ అనే సీక్" అనే ఒక బ్లాక్ అండ్ వైట్ షార్ట్ ఫిలింలో వియ నటించింది.